దత్తపది
దత్తపది
*అత్త, కొత్త, విత్త, పాత*
మత్తకోకిల /
(అత్త)వారినిగాంచి మండుచు నాదరమ్మును జూపరీ
(కొత్త )విద్యలు నేర్చి యుందురు కోడలమ్మలు బాపురే!
(విత్త)మున్ గని పెండ్లి చేసిన ప్రేమలన్నవి యుండునా!
మత్తులోపడి (పాత)కంబగు మాయకట్నము కోసమై
పెత్తనంబును జేయ బోయిన వేదనల్ కలుగున్ గదా!
------------------------