STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

నువ్వూ ఒక అనుభూతివి..

నువ్వూ ఒక అనుభూతివి..

1 min
713

అప్పుడే కొట్టిన టెంకాయలోని కొబ్బరికి బెల్లం కలిపి తిన్నట్టు

కొట్టిన మూడో రోజు దోసె పిండి పుల్లుంటలు వేసినట్టు

మా ఊరి సాయిబాబా గుడిలో పెట్టే పులిహోరలో ఇంగువ సువాసన వెదజల్లినట్టు


అత్తిరాస మీద ముద్దపప్పు పోసినట్లు

అలసంద వడలు నూనెలోంచి తీసినట్లు

పెళ్లి లడ్డు ఇచ్చినట్లు

తిరగవాతన్నం రెండో సారి అడిగి మరీ పెట్టినట్టు


వీరబల్లి బేనీషా జిగిరి మరీ ప్లేట్లో పెట్టినట్లు

మధ్యాహ్నం ఎండలో నన్నారి షర్బత్ తాగినట్లు

అల్ల నేరేడు పండ్లు మజ్జిగలో ఊరబెట్టినట్లు

కూర తక్కువొచ్చిన రోజు ఊరగాయ జాడీ దించినట్లు


పిండి బయట పడకుండా కజ్జికాయలు మడిచినట్లు

దోర జామకాయలు తోటలో చూసినట్లు

ఉలవ చారు చేసిన మర్నాడు తిన్నట్టు

సంగట్లోకి రోటి పచ్చడి దొరికినట్లు


రాములోరి పండగప్పుడు పానకం పోసినట్లు

భోగి రోజు దోసెలు పోటీగా తిన్నట్లు

అబ్బో ఎన్ని అనుభూతులు

ప్రతి రుచి వెనుకా కష్టాన్ని గుర్తించి

సంతోషాన్ని కాస్త కలిపినట్టు

నువ్వూ ఒక అనుభూతివి కావొచ్చు కదా

ఎప్పటికీ నా జ్ఞాపకాలతో ముడిపడిపోవచ్చు కదా


గమనిక : రచయిత "తిండిపోతు" అని మీరనుకోవచ్చు. కానీ..



Rate this content
Log in

Similar telugu poem from Abstract