విశ్వాసం
విశ్వాసం
కుక్క లాంటి విశ్వాసం
బాసు కలగన్నాడు
అదేంటో మరి
నన్నే ఎంచుకున్నాడు
కాదూ కూడదూ అన్నా
ఎక్కువ పని ఇచ్చాడు
అది ఏంటి అంటే
కంపెనీ పాలసీ అన్నాడు
పని చేస్తూ పైకి పోతానేమో అంటే
అయితే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాడు
తిండీ నిద్రా కన్నా
>
ఆఫీసే గొప్పదని నమ్మబలికాడు
బయట కూడా బతుకుంది
నే వెళ్ళిపోతా అంటే
అదంతా హెలూసినేషన్ అన్నాడు
కలలో కుక్క
కుక్కతో కల
ఏంటో అంతా మాయ
పని
ఇంకా పని
పేరు అనే భ్రమ
బయటపడే సరికి
పోయింది నా శిరోజాల శోభ