ప్రేమంటే ఇదేలే
ప్రేమంటే ఇదేలే
ప్రేమంటే ఇదేలే,
సహనమే సత్యసిరిలే.
అల్లరి ముచ్చటే వింతఆటలే,
తలదాచుకొను తావే
ఇక లేదులే,
మయూరమై నర్తించు కరమే
వలపేలే,
ప్రియసఖి వంటకమే మాధుర్యాల ఊటలే.
తలవంచితే ఆనందాలరుచి పెరుగునులే,
దిగుళ్ల చింత తొలగించే మాలిషే ఇదిలే,
కలహించని వినోదమే మదిలో పదిలమగునులే,
వలచిన హృది సరసభావమే
నవ్వుల హరివిల్లులే.
