STORYMIRROR

Midhun babu

Comedy Classics Others

4  

Midhun babu

Comedy Classics Others

గాలోడంటారు

గాలోడంటారు

1 min
328


అందమంటే ఇష్టమో ! 

పూవులంటే ఇష్టమో!

తెలియదు కాని

ప్రతిపువ్వును పలకరిస్తాడు 

పరిమళాలు 

అందరికీ పంచుతాడు 


అతని స్పర్శలో 

రాయిరప్పా , చెట్టూపుట్టా 

వాగూవంకా - అన్నీ 

వీణాతంత్రులై

సరిగమలు పలుకుతాయి 

అతడు 

ప్రకృతిగానానికి ఊపిరి 


అతడు

నిశ్శబ్దాన్ని ఛేదిస్తాడు 

అతడు లేకుంటే....

మాటామంతి , పాటాపద్యం 

ఏమీ ఉండవు 

అతడే - 

భాషకు, భావానికి ఊపిరి 

గుండెలను కలిపే పోకిరి


వెనుక ఉండి 

మేఘాలను నడిపిస్తూ .... 

చల్లబడి

జీవుల గొంతు తడుపుతాడు

భూమాతకు పచ్చని చీరె కడతాడు 


అతని స్పర్శలో ...

నిప్పు 

ప్రాణం పోసుకుంటుంది 

' శక్తి ' కి మూలమై , 

జాజ్వల్యమానంగా వెలుగుతుంది 


ప్రపంచాన్ని 

చుట్టి వస్తుంటాడు 

కుదురుగా ...

ఒక్కచోట కూర్చుండ లేడు

అలసట తెలియదు 

నిరంతర శ్రామికుడు

లోకకళ్యాణం కొరకే ......

అందరూ శ్వాసిస్తూ కూడా 

పాపం, అతణ్ణి గాలోడంటారు .

        

     


Rate this content
Log in

Similar telugu poem from Comedy