STORYMIRROR

Midhun babu

Comedy Classics

4  

Midhun babu

Comedy Classics

చిరునవ్వు

చిరునవ్వు

1 min
9


జారుతున్న కంటిచుక్కకు

నవ్వు గొప్పతనం చెప్పాను,

నాటకాల అనుబంధాలు

పలకరించు కలలుగా చూడమన్నాను,

చెమటపాట పల్లవించు పెదవులకు

ఆశలేని తలపులనే కానుకిచ్చాను,

చెక్కిలిపై నవ్వునే

పరమాన్నంగా భావిస్తూ జీవితాన్నే సాగిస్తున్నాను.


మౌనమైన ఆత్మీయత అనురాగాలకు

మదినే దూరంచేసాను,

అహంకారంలేని ప్రేమాలయాన్నే

దేవుడి కోవెల అంటాను,

సుఖశాంతులిచ్చు చిరునవ్వుతో

వయసు అలసట తీర్చుకుంటాను,

వికారాలను వదిలేసి

గుండెనిండా సంతోషాలే నింపుకుంటాను.


మానవతే ఆహ్లాదపు చిరునామాగా

చెప్పుకుంటాను,

చిరునవ్వుల సిరులతో

జగతి వర్ధిల్లాలని దేవుడిని ప్రార్ధిస్తాను,

వెర్రి బామ్మగా కాదూ

చిరునవ్వుల మహారాణిగా

లోకానికి కనిపిస్తాను,

పరబ్రహ్మ స్వరూపాన్ని

చిరునవ్వులో చూడమని

 విశ్వజనులకు చెపుతాను


Rate this content
Log in

Similar telugu poem from Comedy