STORYMIRROR

Midhun babu

Comedy Classics Others

4  

Midhun babu

Comedy Classics Others

నవ్వులు బండి

నవ్వులు బండి

1 min
3

అలసిపోని ఆనందానికి సంకేతమా నవ్వులబండి,

కేరింతల కోలాటాల శుభసూచకమా నవ్వులబండి,,

చిరునవ్వుల చిరునామా చెప్పేదా నవ్వులబండి,

తీరిన కోరికల ముచ్చటైన

మౌనవాణి నా నవ్వులబండి,

సంతసాల వెలుగుదారులు చూపేటి నేస్తమా నవ్వులబండి.

చిత్రమైన అంతరంగపు తమాషా హృదయభాషా నవ్వులబండి.

చిత్తమందు ఏముందో తెలపరా

సరదా సంతోషాలు కలతలకాలాన్ని దాటించలేవురా.


చూపులతో అదృష్టాన్ని వెతికితే

సాగదు సాఫీగా నవ్వులబండి,

చిలిపిచేష్టల కాలమే మధురమైన అనుభూతుల్ని

శాశ్వతం చేస్తుందా అని అడుగుతుంది నవ్వులబండి,

అందమైన ఊహ

 బ్రతుకు ఆరాటం తీర్చేదిగా వుండాలని కోరుకోమంటుంది నవ్వులబండి,

వలసపోని మమతలతో నవ్వుల మహిమను లోకానికి చూపమంటుంది నవ్వులబండి


Rate this content
Log in

Similar telugu poem from Comedy