STORYMIRROR

# Suryakiran #

Comedy

4.5  

# Suryakiran #

Comedy

కరువైంది ప్రియా !

కరువైంది ప్రియా !

1 min
348



కరువైంది ప్రియా నాకు మనశ్శాంతి ,

నీవు నావైపు చూడక !


ఈ రోజు నీకు నచ్చే పచ్చనిపూలు తేలేదనా ,

ఘల్లుమనే ఆ గాజులు కొనలేదనా ?

లేక , ఊటీ బ్యూటీని

డ్యూటీఫుల్గా మళ్ళీ చూపలేదనా ?‌‌


ఆ అలకలో నీవు ఎర్రనిచిలుకలా ,

చిర్రుబుర్రులాడే ముఖంతో

మంకీమాస్కును పెట్టుకున్న పెంకిదానిలా !


నీ అందం నిజానికి పున్నమిజాబిలి చ

ందం .

నీవు కురిపించే

చల్లని వెన్నెలతో మనమధ్య తీయని బంధం .

నా మనసు వెన్నలా కరిగిపోదా

నీవు పచ్చిమిర్చి పకోడీలను వేడివేడిగా తిన్నట్లుంటే ,

ప్రేమ ఎండమావిలా మారదా ,

గ్రీష్మంలోని ఉష్ణంలా నీ చూపులు తీక్షణమౌతుంటే !


చెప్పదలచుకున్న ముచ్చట్లు అర్థమయ్యేలా

ముద్దుముద్దుగా పంచుకోవా ,

అప్పుడే నన్ను గెలుచుకోగలవని తెలుసుకోవా !



Rate this content
Log in

Similar telugu poem from Comedy