STORYMIRROR

hruday lankipalli

Comedy Romance Fantasy

3  

hruday lankipalli

Comedy Romance Fantasy

విచిత్ర ప్రేమ

విచిత్ర ప్రేమ

1 min
21

ఎప్పుడు పుట్టానో తెలియదు, ఊహ తెలిసే సరికి నీవెనుక నేనున్నా.

నిన్ను చూస్తుంటే నాలోని ప్రేమ ఉప్పొంగుతోంది. 

నీ దారికి చేరడానికి నేను అడుగు ముందుకు వేస్తే నువ్వు నానుండీ దూరంగా అడుగు వేస్తావు.

నీ పొందు కొరకు నేను పరుగులు తీస్తే నువ్వు కూడా అంతే వేగంగా నాకు దూరంగా పరుగెడుతావు.

అలుపుతో నేను వేగం తగ్గిస్తే నువ్వు కూడా ఆగుతావు.

నీ వెంట పరిగెడుతుంటే తెలిసింది, నావెంట కూడా ఒకరు పరిగెడుతున్నారనీ, తనదీ నాలాంటి పరిస్థితేనని.

ఇలా మనం ఒకరికోసం ఒకరం ఎంత ప్రరిగెత్తిన మన మధ్య ఉన్న దూరం అణువంతైనా కరగదు.

మన ఈ గమనం లేని ప్రయాణం వేరొకరికి సెదను తీరుస్తుందే తప్ప మన విరహాన్ని తగ్గించదు.

అనుదుకే ముందున్న నీకు నా ప్రేమను ఇవ్వలేక, వెనకున్న తన ప్రేమను పొందలేక, మానని విఫల ప్రయత్నాలతో, ఈ నిరంతర ప్రయాణాన్ని సాగిస్తున్నా.


ఫ్యాన్ లో ఉన్న ఒక రెక్క ఇంకో రక్కకు తన ప్రేమను చెబితే ఎలా ఉంటుందోనని నా ఈ చిన్ని ప్రయత్నం.


Rate this content
Log in

Similar telugu poem from Comedy