యువతా మేలుకో
యువతా మేలుకో


*******
మత్తు పదార్ధాల గమ్మత్తు నుండి
వయసు తెచ్చే ఆకర్షణల మాయాజాలం నుండి
పై పై రంగుల మెరుపుల నుండి
మాయ చేసే బుల్లి పెట్టె ఇంద్రజాలం నుండి
పబ్బు, మందు , మగువ అంటూ
ఆకర్షించే దురలవాట్ల నుండి
పాఠశాల నుండి కళాశాలకు రాగానే
మొదలయ్యే దురలవాట్ల నుంచి
మేలుకో...యువతా...మేలుకో
ఎందుకంటే ......
భావి భారత పునాది నువ్వు
సత్సంప్రదాయ గళం నువ్వు
స్వర్ణ భారత ఆశవు నువ్వు
నవభారత నిర్మాణంలో కూలీవి నువ్వు
బావి బారతానికి ఆదర్శం నువ్వు
బాలల మార్గదర్శి వి నువ్వు
భావి తరాలకు బాట చూపే వెలుగే నువ్వు
*************