ఆశగా అత్యాశగా...
ఆశగా అత్యాశగా...
కడుపున మోసిన తల్లి ఒడికి
భారమై చెత్త కుండిలోకి చేరీనా
అదృష్టమె పట్టింది అనుకున్న
నన్ను అక్కున చేర్చుకున్న హృదయాన్ని చూసి
నా పెదవి చిరునవ్వు తొడిగే సమయానికి తెలుసుకున్న
మనిషి అసలైన గుణ గణాలు అతని లోపలే ఉంటాయని
ఆ ఆదరణ వెనుకున్న ఆలోచనని
తప్పించుకోలేని బలహీనురాలిని
ఊహా తెలుస్తున్న పసిదాన్ని
కన్న వారికీ భారమైన నేను
కాసులకు బేరం అయ్యాను
కన్నీళ్ళ జీవితానా
బగ
బగ మండే ఆకలి మధ్య
నిప్పులు కురుసే ఎండల మధ్య
కటిక అమావాస్యల మధ్య
మిగిలాను అంగడి బొమ్మనై
అంతర్లీనంగా అల్లుకున్న విరక్తీ కి
వాస్తావాన్ని తెలియ చేస్తూ
బ్రతకడానికి అద్దాను రంగులు
నా ఈ ముఖానికి
ఈ మూగ బాధకు ఏ పేరు పెట్టినా
సహించాను కానీ
నా బిడ్డ బంగారు భవిష్యత్తు
చూడాలని ఉంది ఆశగా
ఆశగా అత్యాశగా....
Women's Diary...