ఆ చిరునవ్వుని చిదిమేశారు
ఆ చిరునవ్వుని చిదిమేశారు


అక్కడ జంతువు యదేశ్చగా
నడి రోడ్డుమీద సంచరిస్తాయి
లెక్కలేనంత కామ క్రోధాలతో
ఆ మెదళ్ళు నెత్తురు కోసం
కోరలు చాచి ఎదురు చూస్తూ...
అక్కనైనా... చెల్లినైనా...చివరకు
తల్లినైనా చెరచ ఆలోచిస్తుంటాయి!
ఇక్కడ ఓ లెక్క పొరపాటు..అవి
కోరలూ కొమ్ములూ ఉన్న మూగ
పశువులుకాదు..మానవమృగాలు!
ఇంగితం లేని ఎంగిలాకులు రోడ్డుపై
అడ్డదిడ్డంగా ఎగురుతూ స్వచ్ఛమైన
ముఖాలపై బరితెగించి ఊపిరి తీస్తాయి!
చర్చించండి రెండుమూడు రోజులే
మరో రోజు మరికొన్ని మృగాలు ఏవో..
ఇళ్లలోకి దూరి నానా అఘాత్యాలకు
ఒడుగట్టి చట్టం కంచె సందుల్లోంచి
బయటకొచ్చి కరుడు గట్టిన నేరస్తుడు
హోదాతో అనధికార రాజ భ
ోగాలు
రాచకీయ అండదండలు చవిచూస్తాయి!
చీకటి పడకముందే స్త్రీని దాచకపోతే...
నిక్కమైన వీధికుక్కలు తిరుగుతూ...
'నిర్భయ' చట్టం నిద్రపోతున్నపుడు
నిర్దయగా ఆమెను చెరిచి చంపేస్తాయి!
అమ్మా... మమ్మల్ని క్షమించు మేము
వాళ్లకు శిక్ష పడేవరకూ కేవలం
సమీక్షకులమే నీ సానుభూతిపరులమే!
రాక్షసుడుతో ఆ మనిషిని పోల్చకండి
ఆమె అనుమతి లేదని ఆమెను
తాకనైనా తాకకుండా కనీస నీతిని చూపి
చరిత్రలో నేటి నికృష్టుల కన్నా నయం
అనిపించుకుంటున్నాడు...ఆ రాక్షసుడు!