STORYMIRROR

Women's Diary

Classics Inspirational Children

3  

Women's Diary

Classics Inspirational Children

ఓ అమ్మ నాన్న..

ఓ అమ్మ నాన్న..

1 min
261


అడుగులు పడుతున్న 

చిదిమిన ప్రాణం నాది 


ఉపిరి పోసుకుంటున్న 

కరిగిపోయే ఆయిష్షు నాది 


ఈ లొకం చూడనీ నాపై 

ఆయుధాలతో దాడి 


ఎందుకో నాకు తెలుసు 


మీ యదపై పవళించాల్సిన నేను


ఎదిగే సమయంలో భుజాలపై 

ఎదిగిననాడు మీ గుండెలపై భారాన్ని 


మీ ఇంటి పేరును మోయలేననా

మీ వంశానికి నిలుపలేననే కదా 


రూపం దిద్దుకోక ముందే

నాపై కత్తులతో యుద్ధం 

కడతేర్చారు కాఠీన్యంతో


కానీ అమ్మ నాన్న 

ఎలా మరిచారు 


నెను మీ ప్రేమ కీ ప్రతిరూపాన్నని 

మీ అడుగులో అడుగేసే నీడనని 

ఈ సృష్టిని ముందుకి నడిపే 

ఆడపిల్లనని......







Women's Diary..


Rate this content
Log in

Similar telugu poem from Classics