అడుగులు ఆపకు నేస్తం..
అడుగులు ఆపకు నేస్తం..
విధి చేసిన గాయం
జీవించడం నేర్పుతుంది
కాలం చేసే గాయం
జ్ఞపాకాలని మిగులుస్తుంది
ప్రేమ చేసిన గాయం
అంధకారాన్ని అందిస్తుంది
ఓటమి చేసిన గాయం
విజయానికి మార్గం చూపుతుంది
తప్పుల నుండి పుట్టిన గాయం
గుణపాటం నేర్పిస్తుంది
తూటాల్లాంటి మాటలు చేసిన గాయం
"ql-align-center"> విలువలు నేర్పుతుంది
నమ్మకం చేసిన గాయం
హృదయాన్ని ముక్కలు చేస్తుంది
కపటం చేసిన గాయం
కన్నీళ్ళని మిగులుస్తుంది
ఏదేమైనా గాయం చేసేవారికి అది కమ్మని గాయమే అనిపిస్తుంది....
కాని గాయపడిన మనసు అనుభవించే బాధ వర్ణనాతీతం.... మైనా
అడుగులు ఆపకు నేస్తం
కమ్మని గాయమే అయినా
తీరని బాధనే మిగిల్చినా...
Women's Diary..