STORYMIRROR

Sita Rambabu Chennuri

Tragedy

4  

Sita Rambabu Chennuri

Tragedy

మానవత్వాన్ని విడిపించండి

మానవత్వాన్ని విడిపించండి

1 min
449

మానవత్వాన్ని విడిపించండి


మనిషే భయపెడుతున్నాడిప్పుడు

మానవత్వం చిగురించని మనిషే భయపెడుతున్నాడు

కామంలో కూరుకుపోయిన మనిషంటేనే దడ...

క్రూర మృగాలకన్నా దయకలుగుతుందేమో

దయలేని మానవ మృగాలుకదా

చంపటమో అలవాటు వీటికి

అనుబంధాలు ఆప్యాయతలు

ఈమృగాలకు ఏ పరిమళాన్ని అద్దలేవు...

అమ్మా ఆలి అక్క చెల్లి పదాలను

మింగేసిన కామాంధులు

ఒళ్ళంతా కోరిక పూసుకున్న చీడపురుగులుకదా

పిచికారీ చేసినట్టు ఏరేయాల్సిందే...

పురుగూ పుట్రా భయంలేదిప్పుడు

తప్పించుకోవచ్చు..రక్షించే మనిషే ఇప్పుడు భక్షకుడు

కాటేసే మానవ మృగాలను శిక్షించే వ్యవస్థే నీరసిస్తుంటే

మనుషులను నమ్మలేని కాలంలో

ప్రాణానికి ప్రాణమన్న నేచురల్ జస్టిస్ అమలుచేస్తామని

దేవుడో దయ్యమో దిగొస్తే బావుండు

సత్వర న్యాయం కోసం..

బందీయైన మానవత్వాన్ని విడిపించటంకోసం...


(మానవ మృగాల దాడికిబలైన ప్రియాంకా రెడ్డికి నివాళులర్పిస్తూ)


Rate this content
Log in

Similar telugu poem from Tragedy