ముందస్తు హెచ్చరిక
ముందస్తు హెచ్చరిక


ముందస్తు హెచ్చరిక
వాయుగుండమొచ్చిన ప్రతిసారీ
ఓ హెచ్చరిక జారీఅవుతోంది
అప్రమత్తం సుమా అంటూ
హేమంతంలో తడినేల
రాతిగుండెలను కంటినేల
అన్న అమ్మ దుఃఖం లా ఉంది
తాకుతున్న చల్లగాలి
చేవచచ్చిన సమాజంలా
అభావంగా ఉంది
కదం తొక్కే కాలం
కాలుకయిన గాయంతో
కూలబడ్డ క్రీడాకారుడిలా ఉంది
పోయిన జ్ఞాపకాలను వెతుక్కుంటూ
ఒంటరి పక్షి దీనాలాపనతో
రెపరెపలాడే దీపంలా భయపడుతోంది
ఎక్కడో వాయుగుండానికి
ముందస్తు హెచ్చరికలుంటే
ఇక్కడి మృత్యు గండాన్ని గుర్తించలేనందరూ దోషులే