ఆటవికులు మీరు!
ఆటవికులు మీరు!


కెరటాల పరుగుల జోరు
పర్వతాల చెక్కుచెదరని పొగరు
అందాలన్నీ ప్రకృతి తీరు
మరి మాకెందుకు మిగిలింది కాటుక కన్నీరు?
వరి వెన్ను నా నడుమన్న వారు,
లోయల అందాలు నా యద ఎత్తులతో పోల్చినవారు,
సంద్రం కెరటాలతో పసిపిల్లలై ఆడే మీరు,
పసి కూనలుగా నా వొళ్ళోనే పెరిగారు,
ఇంటికి దీపం ఇల్లాలన్నవారు,
తెల్లారితే తడి గుడ్డతో ప్రాణాలు తీస్తున్నారు,
అడవులు నరికి నాగరికులమైయ్యాం అంటున్నారు,
ఆడదాన్ని ఆట వస్తువనుకుని ఆటవికులైపోయారు!!!