STORYMIRROR

VENKATALAKSHMI N

Classics Inspirational Others

5  

VENKATALAKSHMI N

Classics Inspirational Others

అంతరమెరుగనిఅంతర్వాహిని

అంతరమెరుగనిఅంతర్వాహిని

1 min
330

అమెరికా ఉద్యోగం పొందిన

అంతరిక్ష యానం చేసొచ్చిన

పురుషాహంకారానికి తలవంచే

ఆడపిల్ల ఆడపిల్లే


ప్రతిభను నిరూపించుకున్న

నైపుణ్యం ప్రదర్శించిన

గుర్తింపు నంగీకరించని సభ్యసమాజంలో

ఆడపిల్ల ఆడపిల్లే


త్యాగాలు ఎన్ని చేసిన

ప్రాణాలే త్యజించిన

సహనానికి సవాలుగా నిలిచిన

ఆడపిల్ల ఆడపిల్లే


రక్తపుటేరులు పారించినా

రుధిర భాష్పాలే రాల్చినా

రుధిర జ్వాలల్లో రగులుతూనే వున్న

ఆడపిల్ల ఆడపిల్లే


యుక్తితో ముసలుకుంటున్న

సమర్థతతో సర్దుకుపో పోతున్న

అహం చావని పురుషాధిక్యత లో

ఆడపిల్ల ఆడపిల్లే


వేధింపులకు గురి చేసినా

వివక్షతలో ముంచేసి నా

ఆడ మనసులు అర్థం కాని వ్యవస్థలో

ఆడపిల్ల ఆడపిల్లే


కాలాలెన్ని గడిచిన 

యుగాలెన్ని నడచిన

సృష్టికి ప్రతి సృష్టి చేసిన

ఆడపిల్ల ఆడపిల్లే


తరాలు మారినా 

అంతరాలెరుగని 

అంతర్వాహిని మహిళ

ఆడ మనసును అర్పణ చేసి

నిత్యాగ్నిహోత్రంలా రగులుతూనే

నిత్య సూర్యోదయంలా వెలిగే

జీవన వాహిని మహిళ



Rate this content
Log in

Similar telugu poem from Classics