ఇన్ బిల్ట్
ఇన్ బిల్ట్
ఇన్ బిల్ట్!
...#వాయుగుండ్లశశికళ
మేమంతే!
పాలచుక్కలు పోస్తూనే ఉంటాము,
అది మా ఆఖరి నెత్తుటి చుక్క అయినా కూడా.
పల్లేరు ముళ్ల క్రింద మాకలల్ని తొక్కినాసరే,
నిలబడి నీడగా మారుతుంటాము.
కడుపులో ఆకలి రాజేసి మీ అన్నం మెతుకులుగా మారి,మేము అమృతం తో ఆకలిని జోకొట్టుకుంటాము.
రెక్కలు చిదిమేసి రోడ్డుమీద పడేసినా,
కాలిగోరంత ప్రేమ దొరికితే పది అడుగుల తాటి చెట్టు అయిపోతాము.
మీ సరిహద్దుల చదరంగాల్లో, బాంబుల మోతల మధ్య ఇటున్నా అటున్నా ఇంటికి భయాన్ని కప్పి పిల్లల్ని కడుపులో పెట్టుకుంటాము.
గుండెలు తన్ని వెళ్లిన అడుగులు,
ఆకలిని మిగిల్చిన చీదరింపులు,
ఇన్నింటి మధ్య పాదులు చేస్తూనే ఉంటాము ప్రేమ మొక్కకి!
ఖండాలు మారినా, ఎన్ని ముక్కలు చేసి చూసినా అవే లక్షణాలు.
ఇన్ బిల్ట్ ఇదే ప్రొగ్రామింగ్ చేసినట్లున్నాడు సృష్టికర్త!
@@@@@
(మరాం-ఆల్-మస్త్రీ సిరియా కవయిత్రి అనువాదం చిన వీరభద్రుడి గారి వాల్ మీద చదివి వ్రాసుకున్నది)