ధనానికి కాకు దాసోహం
ధనానికి కాకు దాసోహం

1 min

293
ధనమే అన్నిటికీ మూలం...
మనుషులను మార్చేసి,బంధాలను తెంచేసి,
మాటకు విలువ తీసేసి ,రంగు రంగుల కాగితాలతో
నిన్ను ఈ రంగుల ప్రపంచంలో తోలుబొమ్మని చేసింది.
మానవత్వం మరచిపోయి, ఉసరవల్లిగా మార్చింది
ధనానికి దాసోహం అయితే మనసుని కమ్మేస్థుంది అహం,
కనులకు కనిపించదు నిజం,
పదవులు- హోదాలు తాత్కాలికం,
సిరి సంపదలు నిలిచిపోవు కలకాలం,
నిలవదు ఏది ఎల్లకాలం,
నీది అనుకునే లోపే మరొకరికి సొంతం,
ఏ జీవికి శాశ్వతం కాదు ప్రాణం,జీవితమే
ఒక జగన్నాటకం,ధనానికి కాకు దాసోహం.
✍️జ్యోతి మువ్వల.