మైమరపు
మైమరపు
గ్రీష్మం మొదలైంది
తూరుపు దరిదాపుల్లో
తపనుడు తారసించే తరుణం
అరుణం లేత కిరణం
వనిత వదనం తాకింది
కలికి తళుకుబెళుకుకు
గుండె కళుక్కుమంది
కోవెల కోమలి
కనకపు కాంతిని కాంచిన క్షణం
కదిలే కాలాన్ని అదుపు చేసి
మదిలో మాట పొదుపు చూసి
మదిని దాటినా పెదవి దాటని
మాటతో పోటాడుతుంటే
మెరుపులా మాయమయింది!
మైమరపులా మారిపోయింది!!
రచన : వెంకు సనాతని
