నేను
నేను
నేను
సత్యాన్ని
ఎలుగెత్తి చెప్పలేని
నిలువెత్తు నిస్సత్తువని
నేను
ధర్మాన్ని
కర్మమొనరించని
నర్మగర్భాన్ని
నేను
న్యాయాన్ని
వ్యయపరిచే
క్రయవిక్రయాన్ని
నేను
నీతిని
అతిక్రమించిచే
అధునాతన రీతిని
నేను
నిజాయితీని
అసభ్యపరిచే
సభ్య సమాజాన్ని
నేను
అనవసరపు
నిరాశావాదాన్ని
మదాన్ని, ఉన్మాదాన్ని
అక్కసును వెళ్ళగ్రక్కే
అహాన్ని, దేహాన్ని
రచన : వెంకు సనాతని
