బాధ్యులెవరు?
బాధ్యులెవరు?
పాఠం చెప్పిన ఘనత
పూటకు కూడా గతిలేక
ప్లాటుఫారమ్ములపై
చెప్పులు అమ్ముతుంది
డిగ్రీలు పట్టిన భవిత
పట్టా పక్కనపెట్టి
పట్టెడు కూటికోసం
మట్టిమోస్తుంది
పస్తులుండలేక
నమ్ముకున్న వారిని
పస్తులుంచలేక
వచ్చిన పని చేసేది లేక
రాని పని చేయలేక
కాని మాటలు పడుతూ
బతుకు బండిని నెడుతూ
మౌనంగా ముందుకు సాగుతుంది.
సమాజాన్ని సంస్కరించే
గురువులకు ఏమిటీ పరిస్థితి
సమస్యలకు సమాధానమివ్వలేని
పరువును అరువు తెచ్చుకునే దుస్థితి
బాధ్యులెవరు.?
బాధ్యులెవరైతేనేం!
ఏడు పదుల ఏళ్ళ నుండి
ఇదే వ్యవస్థ.. ఇదే అవస్థ..
రచన : వెంకు సనాతని
