STORYMIRROR

వెంకు సనాతని

Classics Inspirational

4  

వెంకు సనాతని

Classics Inspirational

లక్షల సాక్ష్యులం

లక్షల సాక్ష్యులం

1 min
383

నేను ప్రపంచమై మెలగుచున్నాను 

వారికి ఆ తరగతి గదియే ప్రపంచం 

నేను ప్రచండమై వెలుగుచున్నాను 

వారికి ఆ తరగతి గదియే ప్రభాతం


నేనొక్కడినేనా..!!

నాలాంటి వారినెందరినో

అక్షరం దిద్దించి, అందలం ఎక్కించి

వారు మాత్రం ఆ తరగతి గదికే పరిమితం


నేను అని చెప్పుకు తిరిగే మేమందరం 

తరగతి గదికే పరిమితమైన గురువుల అపరిమితమైన జ్ఞానానికి అక్షర దక్షులం అక్షయమైన జీవితానికి లక్షల సాక్ష్యులం


రచన : వెంకు సనాతని


Rate this content
Log in

Similar telugu poem from Classics