మాతృశ్రీ
మాతృశ్రీ
ఐదేళ్ళ వయసు
జన్మనిచ్చిన అమ్మ ఒడిలో
కమ్మగా నిదరోయే సంగతి
పదైదేళ్ళ ఈడు
తోడబుట్టిన సోదరి స్నేహంలో
స్వేచ్ఛగా ఆడిపాడే సందడి
పాతికేళ్ళ ప్రాయం
సహధర్మచారిణి తనువులో
సగమయ్యే సంస్కృతి
నీరు ఏ పాత్రలో పోస్తే
ఆ పాత్ర రూపం పొందినట్టు
ఇంతి కూడా ఇంతే
ఇంటా బయటా అన్నింటా
ఇట్టే ఒదిగిపోతుంది
మాలిన్యమంటని లాలిత్యంతో
అట్టే మెరిసిపోతుంది
సత్వరజస్తమో గుణాలతో
నిత్య సత్యంగా ప్రకాశించే ప్రతి స్త్రీ
ఓ మాతృశ్రీ
రచన : వెంకు సనాతని
