STORYMIRROR

వెంకు సనాతని

Tragedy Classics

4  

వెంకు సనాతని

Tragedy Classics

రాదారి పాదాలు

రాదారి పాదాలు

1 min
336

ఆకలి ఓ రోకలి పోటు 

పస్తు ఈ బతుకుకి శిస్తు 

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి 

రెక్కలు విరిచి దిక్కులకేసిందో రక్కసి


పరువే బరువై ఊరికి దూరమైంది బతుకు 

పనులే కరువై ఊసుకి దూరమైంది మెతుకు 

పెట్టె బేడా సర్దుకుని మూటాముళ్లూ కట్టుకుని పిల్లాజెల్లాతో మొదలైంది మైళ్ళ ప్రయాణం


కదిలిన ప్రాణాలే అక్షర సత్యాలు 

కమిలిన పాదాలే లక్షల సాక్ష్యాలు 

పచ్చి బాలింతకు పట్టెడన్నం లేదు 

పసిబిడ్డకు పాలెక్కడివి?


ఏ చిత్రకారుని కుంచె గీచెనో 

రాదారి పాదాల రక్తపు ఛాయలు 

ఈ చైత్ర మాసాన నేల రాలెను 

గూటికి సాగిన గువ్వల గుంపులు


వరసపెట్టిన వలస బతుకును 

కసురుకున్నవి ఆకలి కేకలు 

అరచి అరచి అలసిపోయి 

ఉసూరుమన్నవి ఊపిరి తీగలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy