ఆ నలుగురు
ఆ నలుగురు
జన్మించినప్పుడు జనని ఒడి
మరణించినప్పుడు ధరణి ఒడి
వచ్చేప్పుడు తీసుకురాము
పోయేప్పుడు తీసుకుపోము
పుట్టినప్పుడు నూలుపోగైనా ఉండదు గిట్టినప్పుడు పట్టు పావడా ఉన్నా
ప్రయోజనం ఉండదు
పుట్టి గిట్టే నట్ట నడుమ నాటకంలో
నాలుక నుడివే నాలుగు మాటలు
నలుగురిని ఆదరించాలి
కూడుతో గూడు కట్టుకుని
పట్టు తప్పిన కట్టెని
కాటికి కట్టేది వారే
మన పరువు
మన బరువు మోసేది వారే!
మనం లేకపోయినా
ఉన్నామని తెలియజేసేది వారే!!
రచన : వెంకు సనాతని
