STORYMIRROR

వెంకు సనాతని

Tragedy Classics

4  

వెంకు సనాతని

Tragedy Classics

వినేదెవరు?

వినేదెవరు?

1 min
359

ప్రేగు తెంచుకున్నవారు

ప్రేమను కూడా తెంచుకున్నారు

అడ్డాల నాడు బిడ్డలు కారు 

గడ్డాలొచ్చేసరికి అడ్డం తిరిగారు


ఈ విశ్రమానికి పనెక్కువైందని 

ఆశ్రమంలో చేర్పించాడు కొడుకు 

పున్నామ నరకం నుండి తప్పించేవాడు

అన్నమో రామచంద్ర అనేట్టు చేశాడు కడకు


ఇక్కడ అందరూ నాబోటి వారే 

ఒక్కొక్కరిది ఒక్కో కథ 

వెక్కి వెక్కి బాధను వెళ్ళగక్కే వ్యథ 

ఏ కథను కదిలించినా కన్నీళ్ళు వరదౌతున్నాయి 

ఏ ఎదను విదిలించినా జ్ఞాపకాలు రాలి రాశులౌతున్నాయి


ప్రేమగా పిలిచే వారు లేరు 

ప్రాణం పోయేలా అరచినా వారు రారు 

వారెక్కడో దూరంగా 

నేనిక్కడ ఈ నాలుగు గోడల మధ్య భారంగా


ఒంట్లో ఎప్పుడూ ఏదో ఒక నలత 

ఇంట్లో వారు పక్కన లేనందుకే ఈ కలత ఆశువుగా శ్వాసలు అలసిపోతున్నాయి ఆయాసంతో ఊపిరి తీగలు బిగుసుకుంటున్నాయి

మోడైన ముసలి వేరుకు తులసి నీరు పోసేదెవరు? 

వార్థక్యపు వెర్రి కానీ, ఈ గోడు గోడలు తప్పు ఎవరూ వినరు!


రచన : వెంకు సనాతని


Rate this content
Log in

Similar telugu poem from Tragedy