STORYMIRROR

వెంకు సనాతని

Tragedy Classics

4  

వెంకు సనాతని

Tragedy Classics

ఆటబొమ్మను కాను!

ఆటబొమ్మను కాను!

1 min
250

అరమరికల అరుగులపై కూర్చుని

గురివిందలు పరనిందలు చేస్తున్నాయి

అంధత్వ పరివారంతో, ద్వంద్వార్థ పదజాలంతో 

ఏవగింపు ఈలలేసి గోలలు చేస్తున్నాయి


అల్లరి మూకల చిల్లర వేషాలతో

వల్లరి కొమ్మలు తల్లడిల్లుతున్నాయి

ఆరని మంటల మారణహోమంలో

తరుణి గురుతులు తగలబడుతున్నాయి


ఒకరిద్దరు కాదు

పక్కనే ఉండి 

పక్కటెముకలు విరిచే 

గుంటనక్కల గుంపులో

మదపుతోలు కప్పుకున్న 

మనుషులు చాలా


మదమెక్కిన ఉన్మాదాన్ని

మక్కెలిరగ తన్నకపోగా

అక్కున చేర్చకుంటుందీ సమాజం

నన్ను వెక్కిరిస్తూ..


ఓర్పును శ్వాసిస్తూ

ఓదార్పును ఆశించే నేను

మార్పుని ధ్యాసిస్తూ

మౌనాన్ని ధ్యానిస్తున్నాను


అందరినీ కని పెంచే 

అమ్మను నేను

ఆడజన్మను నేను

ఆటబొమ్మను కాను!


రచన : వెంకు సనాతని


Rate this content
Log in

Similar telugu poem from Tragedy