STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శరణు రామా

శరణు రామా

1 min
338


శ్రీరఘు రామా!శ్రితజనపోషా!

కారణజన్మా!కలుషవిదూరా!

వీరుడా వీవే!విమల యశస్వీ 

సారెకు నీకై సలిపెద సేవల్ /


దోసము లెన్నో తొలగగ నిన్నే

వాసిగ మ్రొక్కన్ బలములు కల్గున్

దాసిగ నిల్తున్ దయగొనలేవా!

చేసెద పూజల్ స్థిరముగ రామా!/


జానకి నాధా జయముల నీవా!

గానవిలోలా!గమనిక తోడన్

బ్రాణము వంచున్ బలికితి తండ్రీ!

దానవవైరీ!దరిసెన మీవా!/

----------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics