జలధి
జలధి
సాగరంబున జలఘోష శబ్దమదియె
అనవరతము గా సాగగా హాయిగొలుప
నూగుచుండ తరంగము లుద్ధతించి
ముదము నొందుచు లోకులు మునుగుచుండి
స్నాన విధినాచరింతురు శ్రద్ధతోడ.
రత్న రాశులు ఖనిజాలు రకరకాలు
మంచి ముత్యంపు చిప్పల నెంచిచూడ
సాగరంబు కలిగి యుండ సంపదలను
జలము లందున్న నిధి పొంద సాగుచుండె
నవధి లేనట్టి శోధన లబ్ధియందు.
అంతులేనట్టి జీవులు వింతగొలుప
రకరకంబుల మత్స్యముల్ రయ్యిమనుచు
తిరుగు చుండగ జలధిలోసిరులు కురియ
మత్స్య సంపద జాతికి మనికినిచ్చు.
వర్షముల్ కురిపించెడి జలధులు వసుధ యందు
ప్రాణికోటికి జీవమై వరలునెపుడు
వ్యర్థ మలినాలు కలపక ప్రజలు మెలగి
తీర ప్రాంతపు శ్రేయమున్ గోరుకొనుచు
ప్రకృతివనరులన్ రక్షించ భావితరము
సకల సంపదలను పొందగా జాతి వెలుగు//
