STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నిన్ను కొల్తును తల్లీ

నిన్ను కొల్తును తల్లీ

1 min
249


విలువగు కాలంబు నందు

తెలియక నీసేవ మాని

కలతమెయిన్ గాలి పోతి

బలువగు కష్టంబు వచ్చె

నిలకడతప్పెన్ మనంబు

తలచితి నమ్మా దయార్ద్ర

జలధివి రావమ్మ!గౌరి!

ఫలితము నీయంగ వేగ!

పలికెద నీనామ మెప్డు

చులకనగా జూడకమ్మ!

కులమును గోత్రంబు నిల్పు

కలుముల రాణీ!జయంబు

కలుగగ నీమ్రోల వాలి

పిలిచితి నమ్మా!భవాని!

తెలుగున బద్యంబులల్లి

తెలిపితి నా ప్రేమ తల్లి!

కలిమిని గోరంగ నిన్ను

బిలిచితి నంచున్ దలంచి

పలుకవ? నాతోడ హైమ!

అలుకను నాపైన జూపి

యలుసుగ జూడన్ భరించు

 బలమది లేదమ్మ!నాకు

తలపులలో నిల్పి నిన్ను

గొలిచెద నమ్మా!యపర్ణ!/


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics