ధన సహచరుడు
ధన సహచరుడు
ఆకలైన అవ్వ
అన్నమడగక డబ్బునడిగితే
నోటికందే బువ్వ
రోజురోజుకీ నింగినంటితే
అమ్మనాన్న గుర్తురారు
రూపాయిని పాపాయిగా చూస్తే
స్నేహమన్న మాటలేదు
డబ్బన్నది చేతికొస్తే
మనిషి చేసిన డబ్బే
మనిషిని చేసింది మర
మమతానురాగాలు
తప్పేలా వేస్తుంది ఎర
మానవుడే అన్నాడు
డబ్బే నా లోకం
ఆ డబ్బే అంటున్నది
ఈ లోకం నా దాసోహం
మానవుడే మహనీయుడు
అన్నది ఆ యుగం
మానవుడే ధన సహచరుడు
అంటున్నది ఈ జగం
మనీ మత్తులో మునిగిన
మానవుడు చేస్తున్నాడు
మనిషితో కుస్తీ
మనీతో దోస్తీ
రచన : వెంకు సనాతని
