STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శ్రీ గురుదత్త

శ్రీ గురుదత్త

1 min
338


కందములు /

1.

దత్తా!యని పిల్చిన సం

పత్తిగ జ్ఞానమిడి పరమ పథమును జూపున్

జిత్తము నందున కొలువై

సత్తువ నిచ్చెడి వరదుని శ్రద్ధగ గొల్తున్ /


2.

అవధూత దిగంబర శ్రీ

శివవిష్ణు విరించి తేజ చిన్మయ రూపున్ 

 స్తవముల నుతించ వరమిడి 

భవరోగము బాపి కాచు భక్తులనెపుడున్ /


3.

అనసూయాత్రుల సుతుడై 

ఘనమగు వైరాగ్యసాధక ఋషిగ నిల్చెన్

వినతిగ విశ్రుత భక్తిన్

ప్రణుతింతును దత్త భవుని పాపము తొలగన్ /

4.

ధనధాన్యంబులు సొమ్ములు

ఘన వాహన వైభవములు కాలపు గతిలో

మనలేవు శాశ్వతంబుగ

మునుకొని దత్తుని భజించ ముక్తియె దొరకున్ /


5.

గురురూపుని జటధారిని 

పరమాత్ముండగు విమోహ పావన చరితున్

శరణాగతవత్సలునిన్

సురపూజ్యుని కొల్తు నెప్డు స్తోత్రంబులతోన్ /


6.


కొలిచిన చాలును దత్తుని

విలువగు జ్ఞానము కలగగ వేదన తొలగున్

బలికిన దత్తుని నామము

బలువగు సంసార మనెడి బంధము తొలగున్ /


Rate this content
Log in

Similar telugu poem from Classics