STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

రమ్ము మాధవా!

రమ్ము మాధవా!

1 min
260

ప్రాసాక్షరి.

*సుసుసుసు, మమమమ, లలలల, తతతత*

శీర్షిక :రమ్ము మాధవా!

-----------------------------


వసువులు మౌనులున్ సురలు భక్తిగఁ జేరగ నీదు సేవకై 

విసుగును జెందకన్

బిలిచి వేడ్కగఁ గోర్కెలఁ

దీర్చువాడవే 

పసులను గాచుచుండి యదు భామల ముంగిట నాడువాడ!నే 

కుసుమము లెన్నియో కలిపి కూర్చితి మాలలు ప్రేమతో హరీ!/


అమలిన ప్రేమతో మురిసి యాడుతు నీదరిఁ జేర వచ్చితిన్

గమలపుమోమువాడ!మమ కారము చూపవ మాధవా!వెసన్

భ్రమపడు చుంటినయ్యొ!నిను భావన చేయుచు నిల్చితిన్ బ్రియా!

విమలగుణాన్వితుండ!పరివేదన మాన్పగ రమ్ము మాధవా!/


కలలను కంటినో సఖుడ!కన్నులు మూసిన నీదురూపమే

వలపులఁ గుమ్మరించితిని 

భారముగా గనుపించె సర్వమున్ 

లలనను బాధపెట్టుటయు లాలన చేయుట నీకు నైజమౌ 

జలజలరాలె బాష్పములు జాలిని చూపవదేమి చిత్రమో!/


సతతము నీదు చేష్టలను సంతసమొందుచు తల్చుకొంచు నీ 

కతలను చెప్పుకొంచు నయగారము చిల్కెడి నీదు నవ్వుతో 

వెతలను విస్మరించితిని

బెన్నిధి వీవని నమ్ముకొంటి నో

జితగుణశీల!శౌరి!ఘన సింధుజనాయక!రమ్ము వేగమే!/


Rate this content
Log in

Similar telugu poem from Classics