STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కృష్ణా!కృష్ణా

కృష్ణా!కృష్ణా

1 min
336


పట్టిన పంతము వీడుమ మాధవ!పాలను ద్రావగ రావా!

పెట్టెద హారము కట్టెద పింఛము ప్రీతిని జూపగ లేవా!

నుట్టిని గొట్టుట వెన్నలు దోచుట యొద్దిక కాదిది శౌరీ!

కట్టెద నిన్నిక రోటికి గట్టిగ గారము సెల్లదు కృష్ణా!/


2.

చక్కని వాడవు చల్లను ద్రావుమ!శాంతముతో మనవోయీ!

చిక్కుల దెచ్చెడి బుద్ధిని మానుమ!శ్రేయము గూరును శౌరీ!

ప్రక్కన నాడుచు మాయలు పన్నుచు భామల చీరలు పట్టన్

మిక్కిలి కోపము వచ్చును గేశవ!మెల్గుమ మంచిగ కృష్ణా!/


Rate this content
Log in

Similar telugu poem from Classics