కవిత్వమంటే...
కవిత్వమంటే...
ఉదయంలో తొలి జీవితాన్ని
మధ్యాహ్నం మలి జీవితాన్ని
సంధ్య సమయంలో తుది జీవితాన్ని
ప్రకృతిలో కలపడమేగా కవిత్వమంటే...
బాల్యంలో ఆనందాన్ని
యవ్వనంలో ప్రేమని
వైవాహిక స్థితిలో మాధుర్యాన్ని
తల్లిదండ్రులుగా వాత్సల్యాన్ని
జీవితంలో అనుభవాన్ని
కలగలిపి రంగరించి
రాయడమేగా కవిత్వమంటే.....
పసిపాప నవ్వుల్ని
యౌవనపు సిగ్గుల్ని
సంసార సరిగమలని
ముదుసలి ముఖపు
ముడతల్లో చరమంకపు
చరిత్రని రచించడమెగా
కవిత్వమంటే.......
సంతోషాలను జల్లెడపట్టి
దుఃఖాలను వేరుచేసి
ఒక్కొక్కటి కలిపి వడబోసి
నవరసాలు పలికించడమెగా
కవిత్వమంటే.........
కవిత్వమంటే .......
ఒక్కో అక్షరాన్ని వడిసి పట్టి
జీవన సారాన్ని చిలికి పట్టి
అమృత కలశాన్ని అందించి
ఒక జీవితాన్ని నిలిపేటట్టు
ఆలోచనలను పూవ్వుల మాలాగా
అల్లడమెగా కవిత్వమంటే.......
(ప్రపంచ కవిత దినోత్సవం సందర్బంగా
March 21,)