STORYMIRROR

Siri Kruthika

Fantasy

4  

Siri Kruthika

Fantasy

నువ్వు - నేను

నువ్వు - నేను

1 min
350

నువ్వు.. నేను..


సాగరం నీవు.. నీలో కలిసే నదిని నేను..


వేకువ వెలుగుల సూర్యుని వి నీవు.. నీకై విరిసే కమలం నేను..


శీతల వెన్నెల కురిసే రాకాచంద్రునివి నీవు.. నీ రాకకై వేచిన కలువను నేను..


నిశి రాత్రి లోని తారను నేను.. నాలో అణువణువు లో మెరిసే కాంతివి నీవు..


సుకుమార కోమల పుష్పం నేను.. నాలో నిండిన సౌగంధం నీవు..


గంభీర రత్నగర్భ సంద్రం నీవు.. నీలో ఉవ్వెత్తున ఎగిసే అలనే నేను...


సర్వ సుగుణాల మలయ పర్వతం నీవు... నీపై వీచే మలయ మారుతం నేను..


నా నిశ్శబ్దాన్ని చేధించే మువ్వల సవ్వడి నీ పలుకు.. నా కడలి కన్నీటి ఆవలి తీరం నువ్వు..


నా కాటుక కన్నుల వెలుగు రేఖ నీవు...నా ముక్కున మెరిసే ముక్కెర నీ నవ్వు..


అలుపెరగక కురిసిన నా కన్నులకు వాన విల్లు నీ స్నేహం..


నా చిమ్మ చీకటి నైనా... కమ్మని వెన్నల చేసే ప్రేమ కురిసే నీ చూపు..


అలిసిన ఆశకు , ఊసే లేని ఊహలకు ఊపిరి పోసిన నీ సహవాసం..


నా హృదయం లో వలపు చిలికే యవ్వన కావ్యం నువ్వు..


నా మట్టి గాజుల చప్పుడు ఆధారం నువ్వు..


నా మెడలో నువ్వేసే మన బంధం మాంగళ్యం.. నా చిటికిన వేలు పట్టి నడిపే శక్తే నువ్వు..


నా గుండె చప్పుడు నువ్వు.. నా ఊపిరి లో వెచ్చదనం నువ్వు..


మన జీవన సరస్సులో .. నీకై వేచిన హంసిని నేను...


నువ్వు..నేను..


నా ఆలోచనల్లో నువ్వు.. నీ ఆశల్లో నేను...


నీ నుంచి నా వరకు చేరి .. మనమైన వైనం.. 


మనసైన తీరం... 


మనసైన మజిలీ... మధురమైన మజిలీ..


                   @@@@



ఇది నా హృదయం.. నీకోసం... ♥️



Rate this content
Log in

Similar telugu poem from Fantasy