సంధ్యా రాగం
సంధ్యా రాగం


జాలువారె..రాగమాలిక.. ఆలపించగా..
ఈ వేళ సంధ్య మల్లెగాలి మత్తు సోకగా..
వాలు కళ్ళు మౌన లేఖ రాసి పంపగా..
మేడ పైన అల్లుకున్న జాజి పందిరి ఓరగా..
గగన సీమ లో వేల చుక్కలే మెరుస్తుండగా..
నింగి జాబిలి నిండు రూపం కనులు పండుగా..
శీతల సౌగంధ పవనాలు మేను తాకగా..
రసమాధుర్య తలపులతో తడిసిపోగా..
ఊహల వినువీధి లో విహరించి అలసిపోగా..
వేటు చూపు కాటుక కళ్ళు వేచి చూడగా..