నమో నారసింహా
నమో నారసింహా
నమో నారసింహా
ఇందుగలడందు లేడని
చెప్పిన భక్త ప్రహ్లాదుని మాటను నిజము చేయుటకు
విష్ణు మూర్తి నరసింహ రూపమున
స్తంభము నుండి అవతరించెనట
హిరణ్యకశిపుని వధియించి
ప్రహ్లాదుని కాచెనట
సర్వ భయ నివారణా
నమో శ్రీ లక్ష్మీ నరసింహా అని నే వేడితి
మమ్ముల కావుమని శిరసు వంచి ప్రణమిల్లితి స్వామికి