వర్షం..!!!
వర్షం..!!!
వాన జల్లుల వానాకాలం..
ప్రకృతి ప్రేమికులకు పర్వకాలం ..
కొండలపై ఎండిపోవు మోడులకు..
అందుదాగి నివసించు జీవాలకు..
గిరిపుత్రుల జీవన గమనానికి..
ప్రవహించు సెలయేరై నది ..
శ్రమను నమ్మి సాగిపోవు కర్షకునికి..
ఆతనేసిన పంట సాగుకు..
ప్రతి మనుజుని దాహార్తిని తీర్చుటకు..
నిత్య జీవధారైనది..
పక్షి నుంచి పయోధివసన ప్రాణికోటికి..
గోవు నుంచి క్రూర శార్దూలము వరకు..
జీవనదుల జీవము నింపుటకు..
గంగయై గమించినది..
వర్షమా.. నీవు మా ఆర్షమే..