తొలి వలపు..🌹🌹
తొలి వలపు..🌹🌹
తొలి చూపులో ఉన్న మాధుర్యం
తొలి పలుకులో జాలువారు అమృతం
తొలి అడుగులో కలిగే తడబాటు
తొలి తొలకరిలో వచ్చే సౌరభం
తొలి గానంలో ఒలికే సరాగం
తొలి ప్రేమలో ఏర్పడే అలౌకిక బంధం
నీతో నేను పొందిన అనుభూతులు చెప్పనలవి కావు.
నీతో జరిగిన తొలి పరిచయం
నన్ను బంగరు మీనంలా ప్రేమమయ
సాగరంలో కేరింతలు కొడుతూ ఈదేలా చేసింది.
నీతో కలిసి వేసిన తొలి అడుగు
నన్ను మేఘమాలికను చేసి
అనంత లోకాలలో విహరించేలా చేసింది.
నీతో కలిసిన నా తొలి చూపు
నన్ను ఎన్నటికీ వీడని అనుబంధపు
ఆవరణలో బంధించి వేసింది.
నీతో చెప్పిన తొలి పలుకు
నన్ను కవితాలోకంలోకి జారవిడిచి
ప్రేమ భావనల వెల్లువలో కొట్టుకుపోయేలా చేసింది.
నీతో పాడిన మొదటి పాట
నన్ను సప్తస్వరాలను పలికించే
వీణా వాద్యంగా మార్చి అనురాగ సరాగాలను నేర్పింది.
నీతో గడిపిన మొదటి క్షణం
నన్ను ఎవ్వరూ కనని విశ్వాంతరళంలోకి
తీసుకువెళ్లి అలౌకిక ఆనందపు జల్లులలో తడిపింది.
అంతేనా....!
నీ పరిచయం నాలో ....
కొత్త కళలకు జీవం పోసింది.
కొత్త భావాలను మది నింపింది.
కొత్త అభిరుచులను పెంచింది.
కొత్త అనుభూతులను పంచింది.
కొత్త ప్రేమను రుచి చూపింది.
తొలిలో ఉండే అన్ని సౌరభాలను
నా జీవితంలో నింపింది.
అందుకే నువ్వు ఎప్పటికి ....
నా ప్రియానివే..
నా ప్రియ నేస్తానివే..
నా ప్రాణ స్పందనవే
నా హృదయ నివేదనవే
నా కనుల భాష్యానివే
నా అద్వితీయ ప్రేమ
సామ్రాజ్యపు రారాజువే...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍️✍️ By Radha

