ఓటమి
ఓటమి
1 min
334
ఓటమి.....విజయానికి తొలి మెట్టు
ఆగక సాగావా
శిఖరాగ్రంపై నిలబెట్టు
నిరాశను కౌగిట బిగించకు
ఆశల కౌగిలి సడలించకు
అలుపన్నది దరిచేర్చకు
అవకాశాలను అందించు బాటన
అలుపెరుగక పయనించు ..
అవరోధాలను అధిగమించు
పట్టుదలతో పరిశ్రమించు
అవమానాలను, అవహేళనలను
మనసారా ఆహ్వానించు ..
విజయం వైపు పడే నీ ప్రతి అడుగుకు
అవి శక్తిని అందించు
కసితో దోస్తీ కట్టు
కృషితో చేరు కోరిన ఎత్తు
ఓటమి ...విజయానికి తొలిమెట్టు
ఆగక సాగావా
శిఖరాగ్రం పై నిలబెట్టు .
*******%%%%%%*******
ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు.