STORYMIRROR

Baswaraj Mangali

Tragedy Others

4  

Baswaraj Mangali

Tragedy Others

ఈ క్షణమంటూ లేకుంటే బావున్ను!

ఈ క్షణమంటూ లేకుంటే బావున్ను!

1 min
381

ఈ క్షణమంటూ లేకుంటే బావున్ను,

ఈ బాధంతా తీరితే బావున్ను. అనిపిస్తుంది.


సాలీడు గూడు పోగుల్లా,

దారం లో పడ్డ చిక్కుల్లా,

           సాగే నా ఆలోచనలను చూస్తే...




చక్రం కింద చిత్తయిన నిమ్మకాయలా

ఒత్తిడికి పగిలిన గాలి బుడగలా

           ఉండే నా పరిస్థితి ని గమనిస్తే .....






వనం లో తపంచేస్తున్న ముని కన్నా

జనం లో బ్రతుకుతున్న మనిషే గొప్ప అని

                 మనసు అంటుంటే..



తలకు మించున బరువును మోయొచ్చేమో కానీ 

తన బందాల బరువును మోయలేమని .

                  మెదడు సతమతమవుతుంటే..



.

ఈ భవబంధపు పద్మవ్యూహాన్నీ గెలవడానికి

 ఏ అభిమన్యుడు రావాలి?

ఈ మాసిన బ్రతుకులు మార్చుటకు

ఏ మంత్రదండం కావాలి?

బరువెక్కిన గుండెలో బాధను

తోడే చేద ఏది?

కరుకైన నా కన్నంచును తాకే

మృదువైన చేతేక్కడా?  అని నన్ను నేను ప్రశ్నించుకుంటుంటే.....

        ఈ క్షణమంటూ లేకుంటే బావున్ను,

        ఈ బాధంతా తీరితే బావున్ను. అనిపిస్తుంది.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy