భవసాగరం
భవసాగరం
భవసాగర మంతేనేమో బతుకు
పయనంలో దిగులు మేఘాలు
కమ్ముకుంటే వర్షిస్తూనే వుంటాయి,
కొన్ని కధలంతేనేమో కన్నీటి సంద్రంలో
కొట్టుమిట్టాడుతుంటాయి,
కధ కంచెకు చేరేవరకు ప్రతి
దశలోనూ తీరని వేదనలెన్నో!
ఎడారి ఎండిన జీవితాలే
సగటు మనిషి బతుకులు,
ఏ పొద్దు చూసినా మరో
పొద్దుకు ఎండమావులే !
కాల చక్రం గిర్రున తిరిగినా
వెతల జీవితమే!
బరువైన ఎదలో మొయ్యలేని
భారాలు భరించలేని గాధలెన్నో!
ఆవేదనల సునామీలెన్నో!
తీరమెరుగని తీరని వేదనలెన్నో!
కాలం కొమ్మకు వేలాడుతున్న
బంధాల నడుమ ప్లాస్టిక్ నవ్వులతో
పరిమళం ఏది..? నిశబ్దం తాండవిస్తూ
పరిష్కారమెరగని వెతలెన్నో కదా!
సమస్యలు గుండె కోతకు
గురౌతుంటే అడుగడుగునా
తీరని శోకం;
కాయమున్నంత వరకూ
తీరని వేదనే
