మనసును తాకిన మాట
మనసును తాకిన మాట
హృదిభావాలు అలలై పొంగి మనసు తీరాన్ని తాకినవేళ ఎన్నెన్నో అనుభావాల సారమంతా పొగుపడి జీవిత సమరాంగణoలో ఎదురైన సవాళ్లను నిలేసి వెన్నుచూపని విజేతగా అప్రతిహతనై సాగుతున్న ఆనాడు నువ్వు నాకు నేర్పిన జీవితాపాఠంలో, నా మనసునుతాకిన అమాట ఎన్ని జన్మలకైనా మరచిపోని బాట కదా నాకు నువ్వు చెప్పి మరచిపోయి ఉండవచ్చు కానీ నా ప్రతి అడుగులో ఆచరించే ఆణిముత్యాల మూట గానే దాచుకున్న అరిపోయే దీపం లాంటి నా ప్రాణం నిలిచింది నీ ధైర్య వచనాల ఉగ్గువల్లేకదా నేను గెలిచాను అంటే ఆ గెలుపు నీదే కదా నా జీవితoలో పర్చుకున్న నీడలను తరిమేసిన వెలుగువు నీవే నామనసును తాకి నాలోనిలిచి నన్ను నడిపించింది నీ అపూర్వ అమృత వాక్యాల అలంబనలే ..
