'హరీ!'శతకపద్యములు
'హరీ!'శతకపద్యములు
'హరీ!'శతకపద్యములు.
104.
చంపకమాల.
వినవలె నీదు లీలలను వీనుల విందుగ ముక్తసంగులై
కనవలె నీదు రూపమును కాంచిన దీరు నఘంబులయ్యెడన్
జనవలె నీదు సన్నిధికి చయ్యన మోక్షము కల్గునే సదా
యనవలె నీదు నామముల నార్తిని బాపుట తధ్యమౌ హరీ!//
105.
ఉత్పలమాల.
కోరను పట్టువస్త్రములఁ గోరను రత్నపు రాసులన్నిటిన్
గోరను స్వర్ణ సౌధములఁ గోరను హస్తి తురంగ తేరులన్
గోరను రాజ దర్పములఁ గోరితి నీపద ధూళి రేణువుల్
కూరిమి తోడ నా కొసగి కొల్వున దాసిగ జేర్చుమా హరీ!//
