రగడల సరాగాలు
రగడల సరాగాలు
ॐॐॐ
श्री गुरूभ्योनमः
తురగవల్గన రగడ లమాలిక
శివుని యాన తినొకటిగొని సేవ జేయ గోర వలెను
భవుని చిత్త మందు నిల్పి బాధితుదరి చేర వలెను!
చిన్న యాశ రేపి వారి జీవి తమున శుభము పంచు
వెన్ను గూఁడి యుండి మనసు వెంట కలుగు వెతలు దించు!
కరుణ కలిగి యుండ నీకు కామితములు వెసను దీర్చు
హరుడు, సాటి వారికీయహాయి ధనము సమము గూర్చు!
శోధనలను జేయు మయ్య! శోకములను దీర్పుమయ్య
నీ ధనమును పంచు మయ్య! నిర్ద యగా నుండ కయ్య!!
తరచి చూడ జీవనంబు తనదు సుఖము కొంత వీఁడు
తరలు చుందు వెందు నీవు దాత యన్న ఘనము మెండు!!
పేదవారి కింత నీవు పెన్నిధివిగ మసలు కొనుము
బీద బిక్కిఁ జూసి నంత పెద్ద మనము నసలు ఘనము!!
చావలి బాలకృష్ణవేణి
29 :::05::'24
