STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
4

'హరీ!'శతకపద్యములు.


97.

చంపకమాల.


అపగత మోహశోకమగు నా పరతత్త్వమెఱుంగనైతి స

త్త్వపరుల భాషణల్ వినగ పండితురాలను గాకపోతి నీ

జపతప మంత్రసాధనలు సల్పెడి దార్ఢ్యము లేకపోయె నీ

కృపగొను మార్గమెద్ది?నను గెగ్గలు సేయక తెల్పుమా హరీ!//


గెగ్గలు = గేలి, పరిహాసము.//


98.

చంపకమాల.


తపములు సేయువారలకు తప్పక మోక్షము నిత్తునంచు నా

శపథముఁ జేసినావు కద!సాగిలి మ్రొక్కుచుఁ జేయబూనితిన్

సుపథముఁ గానలేక మదిఁ శోకము నొంది కృశించిపోవు నా 

కుపకృతిఁ జేయవయ్య!పరమోన్నత మార్గముఁ జూపుచున్ హరీ!//



Rate this content
Log in

Similar telugu poem from Classics