పుష్కరాలు
పుష్కరాలు
పుష్కరాలు.
(తేటగీతి మాలిక ).
స్నాన మాడిన పుష్కర జలములందు
పాపరాసులు కాలునా పౌరులార!
కలుషితంబులు నదులలో కలుపుచుండ
పుణ్య మే విధి వచ్చునీ పుడమి యందు?
జలము లందున్న గరళమున్ దొలగ జేసి
పూజ చేయ నా స్నానంబు పుణ్యమిడును.
చెత్త నంతయు తీయించి శీఘ్రగతిని
శుభ్రపరచిన చాలును శోభితముగ
నదుల యందున్న జీవులు ముదముతోడ
బ్రతికి యుండగా వసుధకు బలము పెరుగు.
ముఱికి కాసారములయందు మునుగు చున్న
ప్రజలు విషయము గ్రహియించి వరలవలయు!
త్రాగు నీటికి కష్టముల్ తప్పిపోవు
మార్గమున్ వెదుకంగ నీ మనుజతతికి
భావి జీవన మెల్లయు భవ్యమైన
పథము నందున వెల్గుతో పయనమగును.//
